Coronavirus: మహారాష్ట్రలో 1671 మంది పోలీసులకు కరోనా

Coronavirus: మహారాష్ట్రలో 1671 మంది పోలీసులకు కరోనా
x
Highlights

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత పోరాటం చేస్తున్నాయో.. పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు కూడా అంతే పోరాటం చేస్తున్నారు.

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత పోరాటం చేస్తున్నాయో.. పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు కూడా అంతే పోరాటం చేస్తున్నారు.ఇందులో పోలీసుల తమ విధి నిర్వహణలో భాగంగా కరోనా బారిన పడుతున్నారు. దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న మహారాష్ట్రలో 1,671 మంది పోలీసులకు కరోనా సోకింది. కరోనా సోకిన పోలీసులలో 42 మంది అధికారులు మరియు 499 కానిస్టేబుళ్లు ఇప్పటివరకు కోలుకున్నారు. మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర నుంచి ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్లిన కూలీల్లో 9 మందికి, ముంబయి నుంచి ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్న వారిలో ఐదుగురికి వైరస్‌ సోకిందని అధికారులు వెల్లడించారు

ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అక్కడ శనివారం కొత్తగా మరో 2,608 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,190కి చేరింది. మరణాల్లోనూ మహారాష్ట్ర టాప్‌లో ఉంది. ఇప్పటి వరకూ అక్కడ 1,577 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఒక్క ముంబైలోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.

ఇక అటు దేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,767 కరోనా కేసులు నమోదు కాగా, 147 మంది మృతిచెందారు. దేశంలో ఇంత స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,31,868కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 54,440 మంది కరోనా నుంచి కోలుకోగా, 3,867 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 73,560 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories