ఐదుగురు మంత్రులతో మధ్యప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ

ఐదుగురు మంత్రులతో మధ్యప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ
x
Madhya Pradesh Cabinet (File Photo)
Highlights

ఒక పక్కా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన క్యాబినెట్ ని విస్తరించింది.

ఒక పక్కా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన క్యాబినెట్ ని విస్తరించింది. గ‌త‌నెలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి క‌మ‌లనాథ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. ఆయ‌న స్థానంలో బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ గ‌త‌నెల 23న ముఖ్యమంత్రిగా ప్రమాణ‌స్వీకారం చేశారు. అయితే అప్పటినుంచి మంత్రివర్గ విస్తరణ జరిగింది లేదు.. దీనితో ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కనీసం ఆరోగ్య శాఖ మంత్రి లేడన్న విమ‌ర్శలు వ్యక్తమ‌య్యాయి.

ఈ నేపధ్యంలో న‌రోత్తం మిశ్రా, తుల‌సి సిలావ‌త్‌, గోవిండ్ సింగ్ రాజ్‌పుత్‌, మీనా సింగ్‌, క‌మ‌ల్ ప‌టేల్ మంగళవారం ఐదుగురు మంత్రులుగా మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన రాజ్‌భవన్ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. గ‌వ‌ర్నర్ లాల్జీ టాండ‌న్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఇందులో ఇద్దరు క‌మ‌ల్‌నాథ్ మంత్రివ‌ర్గంలోని స‌భ్యులు కావ‌డం విశేషం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వ‌ర్గాలకు చెందిన వారిని మంత్రివ‌ర్గంలో చోటు లభించింది.

ఇక మే 3 న లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత మరిన్ని మంత్రులను నియమిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక మధ్యప్రదేశ్ లో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి దేశ‌వ్యాప్తంగా వెయ్యి పాజిటివ్ కేసులు దాటిన రాష్ట్రాల్లో మ‌ధ్యప్రదేశ్ ఒక‌టి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 1480కిపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 74 మంది మరణిచారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories