Newspapers: పేపర్ ముట్టుకుంటే కరోనా వస్తుందా.. డాక్టర్లు ఏమంటున్నారు..?

Newspapers: పేపర్ ముట్టుకుంటే కరోనా వస్తుందా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
x
Highlights

కరోనా..కరోనా..ఇప్పడు ఎక్కడ చూసిన ఇదే చర్చ ఏ వస్తువు నుంచి ఎలా అంటుకుంటుదోనన్న భయం ప్రతిఒక్కరిలోనూ ఇదే టెన్షన్ ఉంది. తెల్లవారగానే తొలుత చదివే న్యూస్...

కరోనా..కరోనా..ఇప్పడు ఎక్కడ చూసిన ఇదే చర్చ ఏ వస్తువు నుంచి ఎలా అంటుకుంటుదోనన్న భయం ప్రతిఒక్కరిలోనూ ఇదే టెన్షన్ ఉంది. తెల్లవారగానే తొలుత చదివే న్యూస్ పేపర్ విషయంలోనూ కరోనా భయం వెంటాడుతోంది.పేపర్ ముట్టుకుంటే కరోనా వస్తుందా?డాక్టర్లు ఏమంటున్నారు..?వాచ్ దిస్ స్టోరీ

సూర్యోదయంతోపాటే ఇంటిగుమ్మాన్ని తాకే న్యూస్ పేపర్. కరోనా భయంతో కనిపించడం లేదు. ఎక్కడైనా పేపర్ వేసినా ముట్టుకోవాలంటే వెన్ను వణుకు. న్యూస్ పేపర్‌తో కరోనా అంటుకుందన్న కంగారు

డేంజర్ కరోనాతో ఏ వస్తువు ముట్టుకోవాలన్న జనం భయపడుతున్నారు. ఎక్కడ వైరస్ అంటుకుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆఖరుకు న్యూస్ పేపర్లు వేసుకోవాలన్న భయపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో న్యూస్ పేపర్లు వేయడమే మానేశారు. మరికొన్ని చోట్ల పేపర్లు వేసినా తీసుకోవడానికి జనం జంకుతున్నారు. ఉదయాన్నే సందడిగా ఉండే న్యూస్ పేపర్ల ఏజెన్సీ సెంటర్లు చాలా వరకు మూతపడ్డాయి

న్యూస్ పేపర్లు ముట్టుకోవడంతో కరోనా రాదని డాక్టర్లు తేల్చిచెబుతున్నారు. వైరస్ వస్తుందని అనవసరంగా భయపడొద్దని అంటున్నారు. డెలివరీ బాయ్‌కి కరోనా లక్షణాలుంటే అతనితో కాంటాక్ట్ ఉంటేనే కరోనా వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. సో కరోనా కంగారు అక్కర్లేదు బేఫికర్ గా న్యూస్ పేపర్లు చదవేయొచ్చు పేపర్స్ తో కరోనా రాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చెప్పిందని అనవసరభయాలు వద్దని డాక్టర్లు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories