దేశవ్యాప్తంగా కరోనా స్పీడ్.. గంటల వ్యవధిలో మారుతున్న స్కోర్!

దేశవ్యాప్తంగా కరోనా స్పీడ్.. గంటల వ్యవధిలో మారుతున్న స్కోర్!
x
Highlights

దేశంలో రోజురోజుకు కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. మొదట ఒక కేసుతో మొదలై.. నెల రోజుల పాటు నెమ్మదిగా పెరిగిన కేసుల సంఖ్య ఆ తర్వాత వారం వారం...

దేశంలో రోజురోజుకు కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. మొదట ఒక కేసుతో మొదలై.. నెల రోజుల పాటు నెమ్మదిగా పెరిగిన కేసుల సంఖ్య ఆ తర్వాత వారం వారం రెట్టింపైయాయి. మొదటి నెల రోజుల్లో కరోనా కేసులు పెద్దగా పెరగలేదు. ఆ నెలంతా కూడా కేవలం 3 కేసులే నమోదయ్యాయి. రెండో నెలలలో కేసుల సంఖ్య క్రమేపీ పెరిగిపోయింది. ఈ ఏడాది జనవరి 30 నాటికి మొదటి కేసు నమోదు కాగా తర్వాత 5వ వారం వరకూ కూడా 28 కేసులే నమోదయ్యాయి. అనంతరం దాదాపు 4 వారాలకే కేసుల సంఖ్య 2 వేలు దాటేసింది.

ఒకసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిన విధానం ఒకసారి చూస్తే. జనవరి 30 నాటికి ఒకటే కేసు నమొదైంది. కేసుల సంఖ్య 10కి చేరడానికి 34 రోజులు పట్టింది. ఆ తర్వాత 6 రోజుల్లో కేసులు 50కి పెరిగాయి. తర్వాత 4 రోజుల్లో కేసుల సంఖ్య 100 దాటింది. అనంతరం 6 రోజులకు కేసులు 200కి చేరాయి. తర్వాత 4 రోజుల్లో 500 దాటాయి. అనంతరం 5 రోజుల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 3 రోజుల్లోనే 1800 దాటాయి. తర్వాత ఒక రోజులో కేసుల సంఖ్య 2 వేలు దాటింది.

లాక్ డౌన్ విధించకపోయి ఉంటే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండేదని భావిస్తున్నారు. ఢిల్లీ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగించే విధంగా పెరిగింది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories