పెరిగిన వంట నూనెల ధరలు

పెరిగిన వంట నూనెల ధరలు
x
Highlights

నిన్న మొన్నటి వరకూ ఉల్లి గడ్డలు, కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదురుకున్నారు.

నిన్న మొన్నటి వరకూ ఉల్లి గడ్డలు, కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదురుక్కొన్నారు. ఇప్పుడే కాస్త ఉల్లి ధరలు దిగి వస్తున్నాయని వినియోగదారులు సంతోషపడే సమయానికి వారి నెత్తిన మరో బాంబ్ పేలింది. వంట చేయడంతో ఎంతో ముఖ్యమైన వంట నూనె ధరలు చిల్లర మార్కెట్లో అమాంతం పెరిగిపోయాయి. దీంతో వినియోదారులు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. గత రెండు నెలల్లో భారీగా వర్షాలు కురవడంతో నూనెగింజల పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. ఇదే నేపధ‌్యంలో వంటనూనె ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఉత్తత్పి దారులు సమాఖ్య ఆయిల్ ఫెడ్ తాజాగా ప్రభుత్వానికి నివేదించిన నివేదికలో గత నెల రోజులలోనే లీటరుకు రూ.8 దాకా పెంచారని వెల్లడించింది. ఈ సమాఖ్య మార్కెట్లో విజయ బ్రాండు పేరుతో నూనెను విక్రయిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో నూనెల ధరలు పెరగడం మూలాన చిల్లర మార్కెట్లో కూడా అమాంతం పెరిగిపోయాయి. ఇక నూనె ధరల విషయానికొస్తే గత నెల పామాయిల్ ధర లీటరుకు రూ.68 ఉండగా నిన్న ఆదివారం చూసుకుంటే రూ.86కు చేరుకుంది. ఇలా ఈ మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.18 పెరిగింది. ఈ పామాయిల్ ను ఇండోనేషియా, మలేసియా నుంచి భారత దేశానికి దిగుమతి చేస్తారు. ప్రతి ఏటా దాదాపు 90 లక్షల టన్నులను దిగుమతి చేస్తారు.

ఇక రైస్ బ్రాన్, వేరుసెనగ నూనెల ధరల విషయానికొస్తే రూ.8, పొద్దుతిరుగుడు నూనె ధర రూ.6 చొప్పున పెరిగాయి. ఇక పోతే పొరుగు దేశాలు 50 లక్షల టన్నుల పామాయిల్ ను అదనంగా బయో డీజిల్ తయారీకి తరలిస్తారని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు చైనా కూడా పామాయిల్ దిగుమతులు పెంచుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి.ఏది ఏమైతే నేం అధిక ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు.








Show Full Article
Print Article
More On
Next Story
More Stories