ఒకటో తేదీ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!

ఒకటో తేదీ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!
x
Highlights

కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో వంట‌గ్యాస్ ఉప‌యోగిస్తున్న వారికి గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. తాజాగా గ్యాస్...

కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో వంట‌గ్యాస్ ఉప‌యోగిస్తున్న వారికి గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. తాజాగా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెరిగింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. సిలిండర్ ధర పెంపును పరిశీలిస్తే.. 14.2 కేజీల నాన్ సబ్సీడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరపై అదనంగా రూ.11.5 పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ.593కి చేరింది. అలాగే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరపై రూ.110 పెరిగింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1139కి ఎగసింది.

గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోని క్రూడ్ ధరలు సహా రూపాయి మారక విలువపై ఆధారపడి గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది. ఈ పెంపు ప్రధానమంత్రి ఉజ్వల (PMUY) స్కీమ్ లబ్దిదారులకు వర్తించదని ఇండేన్ గ్యాస్ కంపెనీ తెలిపింది. ఈ లబ్దిదారులు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్‌లో భాగంగా జూన్ 30 వరకూ ఉచిత సిలిండర్ పొందే ఛాన్స్ ఉంది.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories