ట్రాఫిక్ రూల్స్‌పై ఢిల్లీ పోలీస్ వినూత్న అవగాహన

ట్రాఫిక్ రూల్స్‌పై ఢిల్లీ పోలీస్ వినూత్న అవగాహన
x
Highlights

ర‌హ‌దారుల భ‌ద్ర‌త‌, ప్ర‌మాదాలు, వాహ‌నాలు న‌డిపేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై పోలీసులు, ఆర్టీఏ అధికారులు వాహ‌న‌దారుల‌కు అవగాహ‌న క‌ల్పిస్తున్నా...

ర‌హ‌దారుల భ‌ద్ర‌త‌, ప్ర‌మాదాలు, వాహ‌నాలు న‌డిపేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై పోలీసులు, ఆర్టీఏ అధికారులు వాహ‌న‌దారుల‌కు అవగాహ‌న క‌ల్పిస్తున్నా ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా హెల్మెట్లు వాడకుండా వాహనాలు నడుపుతూ ప్ర‌మాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే ఢిల్లీలో సందీప్ సాహే అనే ట్రాఫిక్ పోలీస్ హెల్మెట్ వాడకంపై వాహనదారులకు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నాడు ట్రాఫిక్ రూల్స్ పై ర్యాప్ సాంగ్ పాడుతూ రూల్స్ చెబుతున్నాడు, హెల్మెట్ వాడకంతో ఉన్న ప్రయోజనాలు తప్పనిసరిగా వాడాలని సూచనలూ చేస్తున్నాడు హెల్మట్ ప్రాణానికి రక్షణగా ఉంటుందనీ, తలకు ఎలాంటి అపాయం కలగదని చెబుతున్నారు ఇక హెల్మెట్ లేని వాహనదారులకు తన సొంత డబ్బుతో కొని ఇస్తున్నాడు.

హిందీ సినిమాలోని గల్లీ బాయ్ లోని ర్యాప్ సాంగ్‌కి కొత్త లిరిక్స్ రాసి వాహనదారులకు ట్రాఫిక్ పాఠాలు చెబుతున్నాడు సందీప్ సాహే రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాహనదారుల వద్దకు వెళ్లి మరీ చెబుతున్నాడు. ఇక హెల్మట్ ధరించని వారికి సొంత ఖర్చుతో హెల్మట్లు కొనిస్తున్నారు ఇలా దాదాపు 700 వరకూ కొత్త హెల్మెట్లు కొని బైక్ రైడర్లకు ఉచితంగా ఇచ్చాడు సందీప్ సాహే సందీప్ సాహే సాంగ్ కు ఫిదా అయిన నెటిజన్లు ఈ విడీయోను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ర్యాప్ వైరల్ అయ్యింది.

ట్రాఫిక్ రూల్స్ గురించి వాహనదారులకు చెప్పడం పోలీసుల డ్యూటీయే అయినా సందీప్ సాహే ప్రతయత్నం వెనుక ఓ బలమైన కారణం ఉంది కొన్నిరోజుల క్రితం సందీప్ సాహే భార్యకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతడు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని సంకల్పించుకున్నాడు. ఇందులో భాగంగా ఓ బుక్ లెట్ తయారు చేసి అందరికీ దాన్ని చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నాడు ప్రస్తుత యూత్ ఇలాంటి ఘటనల్లో తమ ప్రాణాలు కోల్పోకూడదనేదే తన ప్రయత్న మని సందీప్ సాహే చెబుతున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories