లాక్ డౌన్ కరోనా వైరస్ కి సరైనా పరిష్కారం కాదు : రాహుల్ గాంధీ

లాక్ డౌన్ కరోనా వైరస్ కి సరైనా పరిష్కారం కాదు : రాహుల్ గాంధీ
x
Rahul Gandhi (File Photo)
Highlights

లాక్ డౌన్ కరోనా వైరస్ కి సరైనా పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.

లాక్ డౌన్ కరోనా వైరస్ కి సరైనా పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ... కరోనా పరీక్షల కోసం కేంద్రం మరింత దూకుడుగా వెళ్లి, వ్యూహాత్మకంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. లాక్ డౌన్ అనేది పాజ్ బటన్ లాంటిదని, ఇది కరోనాకి ఏ విధంగానూ పరిష్కారం కాదని రాహుల్ అన్నారు. ఇది కొంతకాలం మాత్రమే వైరస్ ని ఆపుతుందని అన్నారు. లాక్ డౌన్ నుంచి బయటకు వచ్చాక వైరస్ మళ్ళీ విజృంభిస్తుందని హెచ్చరించారు.

ఇక రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇచ్చి తక్షణం ఆదుకోవాలన్నారు . వలస కార్మికులతో పాటు వివిధ రంగాలను ఆదుకునేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా వెళ్లకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఈ సందర్భంగా రాహుల్ గుర్తుచేశారు. ఇక కరోనాపై పోరాడేందుకు ప్రధాని మోడీ మరిన్ని చర్యలు తీసుకోవాలన్న దీనికి అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాడాలని రాహుల్ అభిప్రాయపడ్డారు... అంతేకాకుండా కరోనా కట్టడికి భారత ప్రజల కూడా కలిసి పనిచేయాలని అన్నారు. కరోనాపై పోరులో కేరళ తీసుకున్న జాగ్రత్తలు అన్ని చోట్లా తీసుకోవాలని సూచించారు. భారతదేశ టెస్టింగ్ రేటు 10లక్షలమందిలో 199గా ఉందన్నారు. పరీక్షలను వేగవంతం చేయాలని అన్నారు.

ఇక భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 829 కరోనా కేసులు నమోదు కాగా.. 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,759కి చేరింది. ఇక ఇప్పటివరకు దేశంలో 420 మంది చనిపోగా, ఇప్పటి వరకూ 1515 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories