logo

ఇంజనీరుపై బకెట్లతో బురద చల్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇంజనీరుపై బకెట్లతో బురద చల్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
Highlights

ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు పీక్ స్టేజ్‌కు చేరింది. కొంద‌రు ఎమ్మెల్యేలు పైశాచిక ఆనందంతో...

ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు పీక్ స్టేజ్‌కు చేరింది. కొంద‌రు ఎమ్మెల్యేలు పైశాచిక ఆనందంతో ఊగిపోతున్నారు. ఇటీవ‌ల ఇండోర్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే మున్సిప‌ల్ ఆఫీస‌ర్‌ను బ్యాట్‌తో కొట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ ఇంజినీర్‌పై బ‌కెట్ల‌తో బుర‌ద పోశాడు. కంకావ‌లి వ‌ద్ద ముంబై-గోవా ర‌హ‌దారిపై ఉన్న బ్రిడ్జ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఎమ్మెల్యే నితేశ్‌ రాణా, ఆయ‌న మ‌ద్ద‌తుదారులు ఇంజినీర్ ప్ర‌కాశ్ షెడేక‌ర్‌పై బ‌కెట్ల ద్వారా బుర‌ద‌ను పోశారు. ఆ త‌ర్వాత ఆ ఇంజినీర్‌ను బ్రిడ్జ్‌కు క‌ట్టేశారు. హైవేపై గ‌తుకులు ఉన్న‌ట్లు గుర్తించిన ఎమ్మెల్యే, అత‌ని అనుచ‌రులు త‌మ ఆగ్ర‌హాన్ని ఇంజినీర్‌పై చూపించారు.



లైవ్ టీవి


Share it
Top