ఢిల్లీలో మోదీపై సమరభేరి... కాంగ్రెస్ 'భారత్ బచావో' ర్యాలీ

ఢిల్లీలో మోదీపై సమరభేరి... కాంగ్రెస్ భారత్ బచావో ర్యాలీ
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో శనివారం మధ్యాహానం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 'భారత్ బచావో ర్యాలీ'ని భారీగా నిర్వహించింది. కేంద్రం ప్రభుత్వం ఎన్డీయే...

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో శనివారం మధ్యాహానం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 'భారత్ బచావో ర్యాలీ'ని భారీగా నిర్వహించింది. కేంద్రం ప్రభుత్వం ఎన్డీయే నిర్వహిస్తున్న విధివిధానాలను ఈ సందర్భంగా వ్యతిరేకించారు. పౌరసత్వ సవరణ చట్టంపై వస్తున్న వ్యతిరేకత, ఆర్థిక మందగమనం, రైతు సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలపై నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పి చిదంబరం సహా కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సోనియా గాంధి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె తెలిపారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఎట్టి పరిస్థితో దేశాన్ని రక్షించుకోవాలని అన్నారు. అంతే కాకుండా దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. రైతు రాత్రీ, పగలు కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర పలకడం లేదని, దాంతో రైతులు ఆర్ధిక ఇబ్బందులను తీవ్రంగా ఎదుర్కొంటున్నారన్నారు. దాంతో పాటు ఇటీవల ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం వల్ల భారతీయలకు తీవ్రనష్టం వాటిల్లుతుందని ఆమె తెలిపారు. అయినప్పటికీ ఈ విషయం గురించి మోదీ-షా ఏ మాత్రం పట్టించుకోవట్లేదని సోనియా విమర్శించారు.

అనంతరం చిదంబరం మట్లాడుతూ.. దేశ ఆర్ధిక వ్యవస్థ నాశనం అవుతోంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో అంచెలంచెలుగా ఆర్ధిక వ్యవస్థ నాశనం అవుతున్నా కేంద్ర మంత్రి వర్గం మాత్రం పరిష్కార మార్గాలు వెతకకుండా ఉందన్నారు.

అనంతరం ప్రియాంక గాంధి మాట్లాడుతూ దేశంలోని ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని, దేశ వృద్ధిరేటు తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బీజేపీ చేతుల్లో భారత రాజ్యాంగం సర్వ నాశనమవుతుందని ఆమె మండిపడ్డారు. అనంతరం బీజేపీ వర్గాలు 'మోదీ ఉంటే అన్నీ సాధ్యమే' అన్న నినాదంపై ఆమె విరుచుకుపడ్డారు. బీజేపీ ఆరేళ్ల పరిపాలనలో ఇప్పటివరకూ ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించలేదని, అంతే కాక చాలా మందిని ఉద్యోగాలను తీసేసారన్నారు. ప్రభుత్వం విధించిన జీఎస్‌టీ పన్ను విధానం వలన వ్యాపారులు నష్టపోయారన్నారు.

అనంతరం ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా జాతి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు. దేశంలో ఇప్పటి వరకూ ఎప్పుడూ లేనంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ఉల్లి ధరలు అధికంగా పెరిగి కిలోకు రూ. 200గా ఉందని ఆయన అన్నారు. నోట్ల రద్దుతో దేశంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిందని ఆయన ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దుతో బడా నాయకులకు లాభం చేకూరిందని, నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories