Top
logo

అరుణ్‌ జైట్లీ మృతిపై రాజకీయ ప్రముఖుల సంతాపం

అరుణ్‌ జైట్లీ మృతిపై రాజకీయ ప్రముఖుల సంతాపం
Highlights

గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (66) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. జైట్లీ మృతి పట్ల పలువురు రాజకీయ నాయుకులు సంతాపం తెలిపారు.

గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (66) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. జైట్లీ మృతి పట్ల పలువురు రాజకీయ నాయుకులు సంతాపం తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు కేంద్ర మంత్రి అమిత్‌ షా జైట్లీ మృతి తీవ్రంగా కలచివేస్తోందని.. వ్యక్తిగతంగా నాకు పెద్ద లోటు అని అన్నారు. జైట్లీ మృతి బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ అన్నారు. జైట్లీ మృతి పట్ల రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలియజేశారు. జైట్లీ కుటుంబానికి, ఆయన అనుయాయులకు తన సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి ప్రజాజీవితంపైనా, మేధావి వర్గంపైనా అపార ప్రభావం చూపుతుందని కోవింద్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైట్లీ మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జైట్లీ మృతిపై స్పందిస్తూ.. జైట్లీ మరణం దేశానికి తీరని లోటు.. ఆర్థికమంత్రిగా జైట్లీ సేవలు మరువలేనివి అని.. ఆయన కుటుంబానికి ప్రగాభ సానుభూతి తెలియజేస్తున్నా కేసీఆర్ అన్నారు. జైట్లీ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జైట్లీ జాతికి ఎంతో సేవ చేశారని, విలువలకు కట్టుబడి ఉన్నారని కొనియాడారు. జైట్లీ మరణంపై చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా జైట్లీ అందించిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు తెలిపారు.


Next Story