గోవాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఒకే కుటుంబంలో ఐదుగురికి

గోవాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఒకే కుటుంబంలో ఐదుగురికి
x
Highlights

దేశంలో కొన్ని రాష్ట్రాలలో కరోనా పెరుగుతున్న సమయంలో తొలి కరోనా రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందింది గోవా రాష్ట్రం.

దేశంలో కొన్ని రాష్ట్రాలలో కరోనా పెరుగుతున్న సమయంలో తొలి కరోనా రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందింది గోవా రాష్ట్రం.. అయితే ఇప్పుడు అక్కడ మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ర్యాపిడ్ టెస్టుల‌ు నిర్వహించగా.. ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రి విశ్వజీత్ రాణే తెలిపారు. అయితే వీరందరూ ముంబై నుంచి వచ్చిన వాళ్ళు కావడం విశేషం.. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

అయితే కరోనా సోకిన ఎడుగురిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విశేషం.. అందులో భార్య,భర్త వారి ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆరోగ్య మంత్రి వెల్లడించారు. వీరంతా మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి వచ్చినట్టు చెప్పుకొచ్చారు. అయితే వీరిని ప్రస్తుతం ఉత్తర గోవాలోని క్యారంటైన్ కేంద్రంలో ఉంచినట్టు ఆయన వెల్లడించారు. ఇక మిగతా ఇద్దరూ లారీ డ్రైవర్లు కాగా... ఒకరు గుజరాత్ నుంచి, ఇంకొకరు ముంబయి నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకూ మొత్తం 6,151 మందికి పరీక్షలు నిర్వహించగా.. 14 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.

ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఒక్కసారిగా చూసుకుంటే మూడోవిడత లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్ , తమిళనాడు , గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.

అక్కడ కరోనా కేసుల సంఖ్య 25 వేల మార్క్ దాటగా, మరణాల సంఖ్య 1000కి చేరువైంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,525 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 78,055 కి చేరుకుంది. ఇక కరోనాతో పోరాడి 2,551మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించడం, భారీ సంఖ్యలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు తరలి వెళుతుండడంతో పలు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories