logo
జాతీయం

నేడు రాష్ట్రపతిని కలవనున్న సీఎం చంద్రబాబు బృందం.. వారికీ మాత్రమే ఆహ్వానం..

నేడు రాష్ట్రపతిని కలవనున్న సీఎం చంద్రబాబు బృందం.. వారికీ మాత్రమే ఆహ్వానం..
X
Highlights

ఏపీకి ప్రత్యేక హోదాతోపాటుగా విభజన హామీలు అమలు చేయాలనీ కోరుతూ సీఎం చంద్రబాబునాయుడు ధర్మపోరాటాలు చేస్తున్న సంగతి ...

ఏపీకి ప్రత్యేక హోదాతోపాటుగా విభజన హామీలు అమలు చేయాలనీ కోరుతూ సీఎం చంద్రబాబునాయుడు ధర్మపోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్ష విజయవంతమైంది. దాదాపు అన్ని పార్టీలకు చెందిన కీలక నేతలు చంద్రబాబుకు దన్నుగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన మరింత వేగం పెంచారు. చంద్రబాబు నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింగ్‌ను ఇవాళ మధ్యాహ్నం కలవనుంది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో కలిసి రాష్ట్రపతిని కలవాలని మొదట నిర్ణయించారు. అయితే రాష్ట్రపతి భవన్‌ కేవలం 11 మందికే అవకాశం ఇవ్వడంతో ఆ మేరకే కీలక నేతలను మాత్రమే తీసుకెళ్లనున్నారు.

Next Story