సర్కార్ బడిలో దారుణం: కూరకు బదులుగా ఉప్పు

సర్కార్ బడిలో దారుణం: కూరకు బదులుగా ఉప్పు
x
Highlights

ప్రభుత్వ పాఠశాలలు అంటే టక్కున గుర్తుకొచ్చేది పేద, మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే.. ఈ బడిలో వారే ఎక్కువగా విద్యాబ్యాసం పొందుతారు. ఇక కనీసం పూట కూడా గడవని స్థితిలో కొంతమంది పిల్లల్ని బడులకు బదులుగా చిన్నతనంలోనే పనులకు పంపుతారు.

ప్రభుత్వ పాఠశాలలు అంటే టక్కున గుర్తుకొచ్చేది పేద, మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే.. ఈ బడిలో వారే ఎక్కువగా విద్యాబ్యాసం పొందుతారు. ఇక కనీసం పూట కూడా గడవని స్థితిలో కొంతమంది పిల్లల్ని బడులకు బదులుగా చిన్నతనంలోనే పనులకు పంపుతారు. అయితే ఇలాంటి వాటికే చెక్ చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టింది. అయితే కొన్నిచోట్ల ఈ పథకంతో చాలా మంది చిన్నారుల కడుపునిండుతున్నా.. మరికొన్ని చోట్ల మాత్రం ఆహరమే దొరకడం లేదు. ఇక మధ్యాహ్న భోజనం పేరుతో రొట్టెలు, కూరకు బదులుగా కేవలం ఉప్పునే వడ్డిస్తున్నారు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అంటే కూరగాయల భోజనం, అరటిపండ్లు, గుడ్లు వంటివి పెడుతుంటారు. కానీ మీర్జాపూర్ జిల్లాలోని సియూర్ ప్రైమరీ ప్రభుత్వపాఠశాలలో మాత్రం ఇలాంటి సదుపాయలు ఏం అందడం లేదని తలిదండ్రులు పిల్లలు వాపోతున్నారు. మధ్యాహ్న భోజనంలో చపాతీలతో పాటు కూర ఇవ్వల్సి ఉంటుంది కానీ విద్యార్థులకు కర్రీ ఇవ్వకుండా.. దానికి బదులుగా ఉప్పు ఇచ్చారు. దీంతో పిల్లలు దిక్కుతోచని స్థితిలో చపాతీలను ఉప్పుతోనే తింటున్నారు. ఉప్పుతో రొట్టెలు తింటున్న చిన్నారుల వీడియోను రాష్ట్రీయ జనతా దళ్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ఇక ఈ స్కూల్ బాగోతం బట్టబయలు కావడంతో అధికారులు ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో నెటిజన్లు దుమ్మొత్తిపోస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories