కదిలే కారు లోంచీ కిందపడ్డ బాలుడు... వైరల్ వీడియో...

కదిలే కారు లోంచీ కిందపడ్డ బాలుడు... వైరల్ వీడియో...
x
కదిలే కారు లోంచీ కిందపడ్డ బాలుడు... వైరల్ వీడియో...
Highlights

చాలా మంది చిన్న పిల్లలతో కలిసి కారులో ప్రయాణించే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కారు డోర్లు లాక్‌ వేయకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం...

చాలా మంది చిన్న పిల్లలతో కలిసి కారులో ప్రయాణించే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కారు డోర్లు లాక్‌ వేయకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం లాంటి నిర్లక్ష్యపు పనులు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటారు. చిన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.

ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. కారు డోర్‌ సరిగ్గా లాక్‌ చేయకపోవడంతో.. టర్నింగ్‌ పాయింట్‌ వద్ద డోర్‌ లాక్‌ తెరచుకొని ఓ బాలుడు కారులో నుంచి కిందపడిపోయాడు. వెనుక, ముందు నుంచి వాహనాలు అతివేగంగా ప్రయాణిస్తున్నా అదృష్టం కొద్ది ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కారులో నుంచి కిందపడే సమయానికి ఎదురుగా ఓ బస్సు బైక్‌, పక్కనుంచి ఓ ఆటో వస్తుంది. బాలుడు కిందపడగానే వాహనాలన్నీ సడెన్‌గా బ్రేక్‌ వేయడంతో ప్రమాదం తప్పింది.

అయితే తండ్రి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. కారు డోర్‌ లాక్‌ వేయకుండా ఉండడం వల్లే బాలుడు కిందపడినట్లు తెలుస్తోంది. పిల్లలతో కలిసి ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డోర్లు లాక్‌ చేశామా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. పిల్లలు సీట్లలో సరిగా కూర్చున్నారా లేదా చెక్‌ చేసుకొని ప్రయాణించాలి. పంకజ్‌ నైన్‌ అనే ఐపీఎస్‌ అధికారి ఈ వీడియోను ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories