logo
జాతీయం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రతిష్ఠాత్మక అవార్డులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రతిష్ఠాత్మక అవార్డులు
X
Highlights

నీటి పారుదల , విద్యుత్ రంగాల్లో కృష్టి చేసిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పురష్కారాలను ప్రదానం చేసింది....

నీటి పారుదల , విద్యుత్ రంగాల్లో కృష్టి చేసిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పురష్కారాలను ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈ అవార్డులు దక్కాయి. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ ఉత్తమ ప్రణాళిక, నిర్మాణానికి గాను ఏపీ నీటిపారుదల శాఖకు అవార్డు దక్కింది. ఢిల్లీలోని స్కోప్‌ కాంప్లెక్సలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్‌ పవర్‌ వార్షికోత్సవంలో ఈ అవార్డును కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్‌ చేతుల మీదుగా ఏపీ ప్రభుత్వం తరుపున మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అందుకున్నారు. అలాగే తెలంగాణలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ 'మిషన్ కాకతీయ' ప్రాజెక్ట్ కు గాను తెలంగాణ రాష్ట్ర నీటిపారులశాఖకు అవార్డు వరించింది. రాష్ట్రప్రభుత్వం తరుపున హాజరైన చీఫ్ ఇంజనీర్ శ్యామ్‌ సుందర్‌ ఈ అవార్డును అందుకున్నారు.

Next Story