చిదంబరం అరెస్ట్

చిదంబరం అరెస్ట్
x
Highlights

కేంద్ర మాజీ ఆర్ధిక శాఖా మంత్రి పి. చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు . ఐఎన్ఎక్స్ మీడియాలో ఆరోపణలు ఎదురుకుంటున్న అయనని సీబీఐ అధికారులు ...

కేంద్ర మాజీ ఆర్ధిక శాఖా మంత్రి పి. చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు . ఐఎన్ఎక్స్ మీడియాలో ఆరోపణలు ఎదురుకుంటున్న అయనని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు . అయితే దీనికి ముందు అయన అజ్ఞాతాన్ని వీడి కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఐఎన్ఎక్స్ మీడియాకి తనకి ఎలాంటి సంబంధం లేదని అయన చెప్పుకొచ్చారు . అయితే సీబీఐ అధికారులు అక్కడికి చేరుకునే లోపే చిదంబరం తన ఇంటికి చేరుకున్నారు . దీనితో సీబీఐ అధికారులు అయన ఇంటికి వెళ్లారు . అక్కడ సిబ్బంది సీబీఐ అధికారులకి అనుమతి ఇవ్వకపోవడంతో అధికారులు గేట్లు దూకి లోపలికి వెళ్ళడంతో చిదంబరం ఇంటిముందు హైడ్రామా నెలకొంది .. చిదంబరం అరెస్ట్ తో పార్టీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories