చెన్నై ఐఐటీ విద్యార్ధిని ఫాతిమా లతీఫా ఆత్మహత్య కేసు సీబీఐకి అప్పగింత

చెన్నై ఐఐటీ విద్యార్ధిని ఫాతిమా లతీఫా ఆత్మహత్య కేసు సీబీఐకి అప్పగింత
x
Highlights

ఫాతిమా లతీఫ్, పాయల్ తాడ్వి, రోహిత్ వేముల... ఇలా పేర్లు చెప్పుకుంటూ చాలానే ఉన్నాయి.

ఫాతిమా లతీఫ్, పాయల్ తాడ్వి, రోహిత్ వేముల... ఇలా పేర్లు చెప్పుకుంటూ చాలానే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సముదాయాల నుంచి వచ్చిన వీళ్లు... ఎంతో కష్టపడి దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. కానీ, తమ లక్ష్యాలను చేరుకోక ముందే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విద్యార్థుల ఆత్మహత్యలకు పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం, చదువులో రాణించలేకపోవడం, హాజరు సరిగా లేకపోవడం, మానసిక ఒత్తిడ్లు మాత్రం కాదు. కేవలం ప్రొఫెసర్ల వేదింపులతోనే తనవు చాలించారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఐటీ - మద్రాసులో కేరళకు చెందిన ఫాతిమా లతీఫ్‌ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా మారింది. విద్యార్థి ఆత్మచేసుకోవడంతో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. తమ తోటి విద్యార్థినికి నాయ్యం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్ ఫర్ ఫాతిమా లతీఫ్ పేరుతో వర్సిటీ అధికారులపై, పోలీసులపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో దిగివచ్చిన తమిళనాడు సర్కారు ఈ కేసును సిబీఐకి అప్పగించింది.

ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య చేసుకునే ముందు మొబైల్ లో సూసైడ్ నోట్ మాకు పంపించిందని ఆమె తండ్రి అబ్దుల్ లతీఫ్ ఆరోపించారు. ఫాతిమా మొబైల్ లోని సూసైడ్ నోట్ లో ఉమా, చక్కు, వప్పిచ, తుంపు అనే పేర్లు ఉన్నాయని, వారే ఆమె ఆత్మహత్యకు కారణం అయ్యారని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అబ్దుల్ లతీఫ్ సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డీజీపీ త్రిపాఠీలకు మనవి చేశారు.

మరోవైపు తమ బిడ్డ బలన్మరణానికి ప్రొఫెసర్ వేధింపులే కారణమని ఫాతిమా లతీఫ్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బిడ్డ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని... సివిల్స్ సాధించాలన్న పట్టుదలతో ఉండేదన్నారు. చదువు ఒత్తిడి వల్లేనని కేసు మూసేసే యత్నం జరుగుతోందని ఆరోపించడంతో సర్కారు కేసును సిబీఐకి అప్పగించింది. తన కుమార్తె ఆత్మహత్యకు సంబంధించిన ఆధారాలను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితోపాటు డీజీపీకి అందజేశామని తెలిపిన ఆయన తన కుమార్తె చావుకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కేరళలోని కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్ ఐఐటీ మద్రాస్‌లో హ్యుమానిటీ సైన్సైస్‌లో MA మొదటి సంవత్సరం చదువుతోంది. గత నెల 9న ఆమె తన హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందామె. చదువు ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుందంటూ మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. ఫాతిమా సోదరి ఆయేషా ఆమె ఫోన్‌ను పరిశీలించగా.. నా చావుకు కారణం సుదర్శన్‌ పద్మనాభన్‌ అనే నోట్‌ కనిపించింది. మరో నోట్‌లో ఆమె.. తన చావుకు కారణం తన ప్రొఫెసర్లయిన హేమచంద్రన్‌ కరాహ్‌, మిస్టర్‌ మిలింద్‌ బ్రాహ్మే వేధింపులే అని స్పష్టం చేసింది. ఈ నోట్‌ను ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు అందజేశారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. చెన్నై పోలీసు కమిషనర్‌ రంగంలోకి దిగి ఆ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా.. ఐఐటీ మద్రా‌స్‌లో ఏడాది వ్యవధిలో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories