logo

చంద్రయాన్-2 అప్‌డేట్..మరికొన్ని గంటల్లో భూమికి చేరనున్న మరో విశ్వ రహాస్యం

చంద్రయాన్-2 అప్‌డేట్..మరికొన్ని గంటల్లో భూమికి చేరనున్న మరో విశ్వ రహాస్యం
Highlights

జాబిల్లి మరో కోణానాన్ని స్ఫురించే సమయం ఆసన్నమైంది మరి కొన్నిగంటల్లో ఖగోళంలో మరో చరిత్రకు..సారి కొత్త...

జాబిల్లి మరో కోణానాన్ని స్ఫురించే సమయం ఆసన్నమైంది మరి కొన్నిగంటల్లో ఖగోళంలో మరో చరిత్రకు..సారి కొత్త శాస్త్రసాంకేతిక రికార్డ్ నమోదు చేయనుంది ఇస్రో. చంద్రుడిపై మానవ మనుగడకు ఉన్న అవకాశాలను శోధించేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్​-2 ఉపగ్రహం జాబిల్లికి మరింత చేరువైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కక్ష్య దూరాన్ని మరోమారు తగ్గించే ప్రక్రియను ఇస్రో చేపట్టనున్నది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగించిన చంద్రయాన్-2 ఉప గ్రహం చంద్రుడిపై ల్యాండ్ అయ్యేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మరికొన్ని గంటల్లో చంద్ర మండలంలోని మరో విశ్వ రహాస్యాన్ని భూమికి చేర్చనుంది. ఇప్పటికే చంద్రమండలంలోని దక్షిణ దృవానికి చేరువైన చంద్రయాన్-2 అక్కడి గ్రహ స్వరూపాన్ని ఛాయచిత్రాలతో భూమికి చేర్చడం ప్రారంభించింది.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్​ ధావన్​ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం చేపట్టిన తరువాత చంద్రయాన్​ -2 గమనాన్ని బెంగళూరులోని బైలాలు భూ నియంత్ర కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు కంట్రోల్​చేస్తున్నారు. చంద్రాయన్​-2ను చంద్రుడికి చేరువ చేసేలే కక్ష్యదూరాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. మరోసారి ఉపగ్రహాన్ని చంద్రుడికి దగ్గరగా ఉన్న కక్ష్యలోకి పంపడంలో విజయం సాధించారు. చంద్రుడికి దగ్గరగా ఉన్న 118 కిలోమీటర్ల ఎత్తు నుంచి మరింత దగ్గరగా 179 కిలోమీటర్ల ఎత్తుకు పెంచారు. ఈ ఉపగ్రహంలోని ఆర్బిటర్​, ల్యాండర్​, రోవర్​లను చంద్రుడికి దూరంగా 4412 కిలోమీటర్ల ఎత్తును 1412 కిలోమీటర్ల ఎత్తుకు తగ్గించి జాబిల్లికి మరింత దగ్గర చేయగలిగారు.

చంద్రయాన్‌–2 మిషన్‌ భూమధ్యంతర కక్ష్యలో ఉన్నప్పుడు కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ పోతే, లూనార్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశించాక కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ రావడం చంద్రయాన్‌–2 ప్రయోగంలో విశేషం. లూనార్‌ ఆర్బిట్‌లో చంద్రుడికి దగ్గరగా 179 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 1412 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘవృత్తాకారంలో ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. లూనార్‌ ఆర్బిట్‌లో కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చి చంద్రుడికి దగ్గరగా 30 కిలోమీటర్లు, దూరంగా 100 కిలోమీటర్లు చేరుకోవడం కోసం మరోమారు ఆపరేషన్‌ చేపట్టేందుకు ఇస్రోశాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కక్ష్య దూరాన్ని మరోమారు తగ్గించే ప్రక్రియను చేపట్టనున్నారు.


లైవ్ టీవి


Share it
Top