Chandrayaan 2: ఆర్బిటర్ నుంచి వేరుపడ్డ ల్యాండర్

Chandrayaan 2: ఆర్బిటర్ నుంచి వేరుపడ్డ ల్యాండర్
x
Highlights

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చరిత్ర సృష్టించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన 'చంద్రయాన్ 2' ప్రయోగంలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్...

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చరిత్ర సృష్టించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన 'చంద్రయాన్ 2' ప్రయోగంలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయింది. సోమవారం మధ్యాహ్నం 1:15 గంటలకు ఆర్బిటార్ నుంచి ల్యాండర్ విడివడినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. మొత్తానికి ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగనుంది. జులై 22న శ్రీహరికోట నుంచి చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. కొద్ది రోజులు భూకక్ష్యలో తిరిగి ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలో చేరింది చంద్రయాన్-2. ఆ తర్వాత కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఐదు సార్లు సమర్థవంతంగా చేపట్టింది ఇస్రో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories