Top
logo

జైట్లీ పార్థీవ దేహానికి చంద్రబాబు నివాళి

జైట్లీ పార్థీవ దేహానికి చంద్రబాబు నివాళి
X
Highlights

బీజేపీ సీనియర్‌నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ పార్థీవ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు.

బీజేపీ సీనియర్‌నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ పార్థీవ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. దిల్లీలోని కైలాష్‌ నగర్‌లో జైట్లీ నివాసంలో ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...వ్యక్తిగతంగా జైట్లీ తనకు చాలా సన్నిహితు.. విద్యార్థి నాయకుడి నుంచి జైట్లీ అంచలంచలుగా ఎదిగారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్నేహితుడిగా సాయం చేశారని చెప్పారు. చంద్రబాబుతో పాటు జైట్లీకి ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు నివాళులు అర్పించారు.

Next Story