చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం

చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం
x
Highlights

చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌...

చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని రెండో ప్రయోగవేదిక చంద్రయాన్-2 ప్రయోగించనున్నారు. ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 15వతేదీన ప్రయోగించాలనుకున్న చంద్రయాన్‌–2ను చివరి గంటలో రాకెట్‌లో మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిపివేశారు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి.. వారం తిరగక ముందే సాంకేతిక లోపాన్ని సవరించి ప్రయోగానికి సిద్ధం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories