Top
logo

జగన్, కేసీఆర్, చంద్రబాబుకు కేంద్రం లేఖ

జగన్, కేసీఆర్, చంద్రబాబుకు కేంద్రం లేఖ
X
Highlights

పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం...

పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల పార్టీల అధినేతలకు పార్లమెంటరీ వ్యవహారీల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖలు పంపారు. ప్రధానంగా 5 లక్ష్యాల సాధన కోసం అన్ని పార్టీల అధ్యక్షులతో ఈ నెల 19న సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కీలక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటున్నారు. పార్లమెంటు ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యలు, ఒకే దేశం ఒకే ఎన్నికలు, 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం, మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ఈ సమావేశంలో చర్చించేందుకు పార్లమెంట్ ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీల అధినేతలు హాజరుకావాలని కేంద్రం తమ లేఖలో కోరింది.

Next Story