ఢిల్లీ అల్లర్లను ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఢిల్లీ అల్లర్లను ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
x
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Highlights

ఢిల్లీలో జరిగిన రాళ్ల దాడిని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నవారు పోలీసులపై రాళ్లు విసిరి శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఢిల్లీలో జరిగిన రాళ్ల దాడిని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నవారు పోలీసులపై రాళ్లు విసిరి శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న సందర్భంలో ఇలాంటి దాడులు జరగడం.. భారత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకేనని అన్నారు.

ఈశాన్య దిల్లీలోని జఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌, గోలక్‌పురి భజన్‌పురలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. స్వల్ప లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలు వాహనాలు, దుకాణాలు, ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఓ ఫైరింజన్‌ సైతం ధ్వంసమైంది.

ఆందోళన నేపథ్యంలో దిల్లీలోని జఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌-బాబర్‌ పుర్‌ మెట్రో స్టేషన్లను మెట్రో అధికారులు మూసివేశారు. 24 గంటల పాటు జఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. పేర్కొంది. నిన్న జఫ్రాబాద్‌ ప్రాంతంలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్న సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories