రెండో రాజధానిగా హైదరాబాద్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

రెండో రాజధానిగా హైదరాబాద్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
x
Highlights

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను దేశంలోని రెండో రాజధానిగా చేసే అవకాశం ఉందని ఇప్పటి వచ్చిన ఊహాగానాలకు కేంద్రం మరోసారి తెరదించింది. ఈ ప్రచారంపై...

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను దేశంలోని రెండో రాజధానిగా చేసే అవకాశం ఉందని ఇప్పటి వచ్చిన ఊహాగానాలకు కేంద్రం మరోసారి తెరదించింది. ఈ ప్రచారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ హైదరాబాద్‌ ను దేశ రెండో రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనేది లేదన్నారు. ఈ విషయం పైన ఇది వరకు తమ మంత్రిత్వశాఖలో ఆయన స్పష్టం చేశానని తెలిపారు. తాజాగా జరిగిన రాజ్యసభ సమావేశాల్లో ఓ సభ్యుడు ఈ ఊహాగానాలకు తెరలేపాడని వ్యక్తం చేశారు. దీంతో హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఆ సభ్యుడు చేసిన వ్యాఖ్యలకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. భారతదేశానికి రెండో రాజధాని అనే ప్రతిపాదన అసలు లేదని ఆయన లిఖిత పూర్వకంగా ఒచ్చిన పత్రంలో తెలిపారు.

గతంలోనూ ఇవే ఊహాగానాలు వచ్చాయని కేంద్రం సభ్యలు తెలిపారు. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా మాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగరరావు రెండో రాజధాని ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దేశానికి మధ్యలో ఉన్న హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మరికొందరు అనుకుంటున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఈ వాదనలు మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories