logo

హిందీపై వెనక్కి తగ్గిన కేంద్రం

హిందీపై వెనక్కి తగ్గిన కేంద్రం
Highlights

కొత్త విద్యా విధానంపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. హిందీ మాట్లాడని...


కొత్త విద్యా విధానంపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని పాఠ్యాంశంగా చేర్చాలన్న మానవ వనరుల అభివృధ్ది శాఖ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ మేరకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్‌లో మార్పులు చేసింది. విద్యార్థులు తాము కోరుకున్న భాషను ఎంచుకునేలా నిబంధనల్లో మార్పు చేసింది. ఆరో తరగతి నుంచి నిర్బంధ హిందీ బాషను ప్రవేశపెట్టాలన్న సూచనను పక్కనబెట్టింది. త్రిభాషా సూత్రంలో భాగంగా ఆరు, ఏడు తరగతుల విద్యార్థులు తమకు నచ్చిన భాషలను ఎంపిక చేసుకోవచ్చని తాజా ముసాయిదాలో స్పష్టం చేసింది.


లైవ్ టీవి


Share it
Top