ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?
x
Highlights

దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే.దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం ప్రకటించనట్టుగానే ఏప్రిల్ 14వ తేది లాక్ డౌన్ ముగుస్తుందా లేదా అన్న విషయం మాత్రం ప్రస్తుతం దేశప్రజలను కాస్త సందిగ్థంలో ఉంచాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నో ప్రశ్నలు, ప్రజలను వెంబడిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనదేశం కన్నా ముందు లాక్ డౌన్ విధించిన దేశాలు ఇప్పటి వరకూ లాక్ డౌన్ ను ఎత్తేయలేదు.

రోజుకు వందల్లో కేసులు నమోదు, మరణాల నమోదు అవుతుండడంతో లాక్ డౌన్ ను కొనసాగించలేక తప్పడం లేదు. ప్రస్తుతం మన దేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరిగిపోవడంతో లాక్ డౌన్ ఎత్తి వేస్తారాలేదా అన్న సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

ఇప్పటికే మన దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,072కు చేరింది. మరణాలు కూడా 77కు చేరుకున్నాయి. అలాగే క్వారంటైన్ లలో, ఐసోలేషన్ల్లో వేలాది మంది ఉన్నారు. రోజుకు పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో కేసులు పెరగడంతో లాక్‌డౌన్‌ను ఇంకా కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో కొనసాగుతుండడంతో ప్రజలు ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు.

కానీ ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కొనసాగించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో 14వ తేది లాక్‌డౌన్‌ ముగుస్తుందంటున్నారు కొంత మంది ప్రభుత్వ అధికారులు. మొన్న ప్రధాని నరేంద్రమోది అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లోనూ ఈ విషయంపైన ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోనప్పటికీ కొన్ని సంకేతాలు మాత్రం ఇచ్చారు.

దీంతో రాష్ట్రాలో కూడా లాక్ డౌన్ ను ఎత్తేస్తే ఎలాంటిజాగ్రత్తలు తీసుకోవాలా అన్న ఆలోచనలతో సంసిద్ధమవుతున్నాయని సమాచారం. ప్రస్తుతానికైతే లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలు లేవని ఇక వేల దేశంలో పరిస్థితులు అదుపు తప్పితే మళ్లీ నిర్ణయం తీసుకుంటారని అధికారులు అంటున్నట్టు సమాచారం.

ఇక లాక్ డౌన్ ను పూర్తయిన తరువాత ప్రజలకు కొన్ని షరతులు విధించే అవకాశం ఉందని కొంత మంది నిపుణులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. షాపింగ్ మాల్స్, థియేటర్స్ లాంటి ప్రదేశాల్లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో చేరుతారని, దాంతో వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంటున్నారు. అప్పుడు ఆయా రాష్ట్రాలలోని పరిస్థితులు, స్థితిగతులను బట్టి ఆంక్షలు విధించేలా ప్రభుత్వాలు సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ తర్వాత ఈ విధంగా ఆంక్షలు ఉండే అవకాశాలు ఉన్నాయి..

1. 65 ఏళ్ల వయస్సు పై బడిన వృద్దులని, 10 ఏండ్ల లోపు చిన్నారులని బయటికి తిర‌గ‌నీయ‌కుండా ఆంక్ష‌లు విధించే అవ‌కాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

2. వాణిజ్య దుకాణాలు, షాపింగ్ మాల్స్ తెరచి ఉంచడానికి నిర్దిష్ట సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

3. కిరాణా షాపులు, సూప‌ర్ మార్కెట్లతో పాటు కొన్ని దుకాణాల పై ఆంక్ష‌లు తీసేనే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.

4. రైల్వే శాఖ ముఖ్యమైన రైళ్లను మాత్రమే నడిపిస్తూ, ప్యాసింజర్ రైళ్లపై ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే జనరల్ భోగీలలో ఎవరూ ప్రయానం చేయకుండా ఉండేందుకు వాటిని పూర్తిగా క్లోజ్ చేసే పరిస్థితి కనపడుతుందంటున్నారు నిపుణులు.

5. ఇక రావాణా లో ముఖ్యమైన బస్సులను కూడా ఒకే సారి కాకుండా దశలవారీగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు.

6. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూర్చే బార్లు, థియేటర్లు, వాణిజ్య సదుపాయాలపై అంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

7. ఇక విమాన సర్వీసులలోనూ ఇదే విధంగా ఆంక్షలు విధంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశీయ విమానాలు ప్రారంభించినప్పటికీ అంతర్జాతీయ సర్వీసులను నడిపించే విషయంలో కాస్త సమయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories