బ్యాంక్ ఖాతాదారులకు కేంద్రం తీపి కబురు...

బ్యాంక్ ఖాతాదారులకు కేంద్రం తీపి కబురు...
x
Highlights

బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ శుభవార్తను అందజేశారు.

బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ శుభవార్తను అందజేశారు. మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఏటీఎం విత్ డ్రా చార్జీలను ఎత్తివేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.. అంటే ఏ బ్యాంకు నుంచైనా ఎన్నిసార్లు అయిన డబ్బులు డ్రా చేసుకోవచ్చు అన్నమాట.. ఎలాంటి చార్జీలు పడవు. వచ్చే మూడు నెలలపాటు అంటే జూన్ 30 వరకు ఇది వర్తిస్తుంది.

ఇక వీటితో పాటు పాన్ కలిగిన ప్రతి ఒక్కరూ దాన్ని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు దీని గుడువును పొడిగిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా మరోసారి డెడ్‌లైన్‌ను పొడిగించారు. సాధారణంగా పాన్ ఆధార్ లింక్ గడువు మార్చి 31తో ముగియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ గుడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇది ఇలాగే కొనసాగితే దేశం మాంద్యంలోకి జారుకునే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను కరోనా బారి నుంచి రక్షించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ పలు నిర్ణయాలు తీసుకుంది.

ఇక కరోనా వైరస్ ప్రభావం వలన ప్రపంచంలో 16000 కేసులు నమోదయ్యాయి. భారత్లో 500 కేసులు నమోదు కాగా పదిమంది మృతి చెందారు. మహారాష్ట్ర కేరళలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories