కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు
x
Highlights

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రేషన్‌ స్కీం కేంద్రం ప్రకటించింది. లాక్‌డౌన్‌తో కరోనాను కచ్చితంగా...

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రేషన్‌ స్కీం కేంద్రం ప్రకటించింది. లాక్‌డౌన్‌తో కరోనాను కచ్చితంగా అరికట్టవచ్చని కేంద్రమంత్రి జవదేకర్‌ చెప్పారు. ప్రజలకు అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయని, పాలు నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయంలో తెరిచిఉంటాయని తెలిపారు. ప్రజలంతా క్రమశిక్షణతో మెలుగుతూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ భరోసా ఇచ్చారు.

ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. నిత్యావసర సరకులకు కొరత ఏర్పడుతుందున్న ఆందోళన వద్దన్నారు. ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని వివరించారు. కిలో గోధుమలు రూ.2కే అందిస్తాం. పాత్రికేయులు, వైద్యులు, సిబ్బంది ప్రజాసేవ చేస్తున్నారు. ఒప్పంద ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి అన్నారు. వదంతులు నమ్మొద్దు. ఈ సమయం కుటుంబ సభ్యులతో గడిపేందుకు కేటాయించండి అని కేంద్రమంత్రి జవదేకర్‌ విజ్ఞప్తి చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories