logo
జాతీయం

అయ్యో చంటి పాప.. ఇంత దారుణమా?

అయ్యో చంటి పాప.. ఇంత దారుణమా?
X
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు సమీపంలో తప్పాల్‌ ప్రాంతంలో రెండున్నరేళ్ల చిన్నారి ట్వింకిల్‌ శర్మ అత్యంత పాశవికంగా ...

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు సమీపంలో తప్పాల్‌ ప్రాంతంలో రెండున్నరేళ్ల చిన్నారి ట్వింకిల్‌ శర్మ అత్యంత పాశవికంగా హత్యకు గురైన దారుణోదంతంపై సోషల్‌ మీడియా వేదికగా సెలబ్రిటీలు గళం విప్పారు. ముక్కుపచ్చలారని చిన్నారిని కర్కశకంగా పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 'జస్టిస్‌ ఫర్‌ ట్వింకిల్‌' పేరుతో ఫ్లకార్డులు పట్టుకుని ట్విటర్‌లో ఫొటోలు షేర్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ నటీమణులు కరీనాకపూర్‌, సోనమ్‌కపూర్‌, సన్నీ లియోన్‌, స్వరభాస్కర్‌ తదితరులు స్పందించారు. ఈ కిరాతకంపై ఎందుకు గళం విప్పడం లేదని సెక్యులరిస్ట్‌లను ప్రశ్నించారు.

ట్వింకిల్‌ హత్యోదంతం దిగ్భ్రాంతికి గురిచేసిందని, హృదయం ద్రవింపచేసిందని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నారు. రెండురేన్నళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన హంతకులను శిక్షించాలని ట్వీట్‌ చేశారు. ఈ దారుణోదంతం గురించి చెప్పడానికి మాటలు రావడానికి బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కోపం కట్టలు తెంచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించేందుకు న్యాయవ్యవస్థ తక్షణమే స్పందించాలని ట్విటర్‌ వేదికగా ప్రముఖులతో పాటు సామాన్యలు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story