నవంబర్ 25న కార్టోసాట్ -3ను ప్రయోగించనున్న ఇస్రో

నవంబర్ 25న కార్టోసాట్ -3ను ప్రయోగించనున్న ఇస్రో
x
Highlights

కార్టోశాట్‌-3తో పాటు మ‌రో 13 క‌మ‌ర్షియ‌ల్ నానోశాటిలైట్ ను నవంబర్ 25న క‌క్షలోకి ప్రవేశ‌పెటనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్...

కార్టోశాట్‌-3తో పాటు మ‌రో 13 క‌మ‌ర్షియ‌ల్ నానోశాటిలైట్ ను నవంబర్ 25న క‌క్షలోకి ప్రవేశ‌పెటనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ 47 ఇంటో సన్ సింక్రోనస్ కక్ష్య ద్వారా ప్రయోగించనున్నారు. హై రెజ‌ల్యూష‌న్ ఇమేజింగ్ సామ‌ర్థ్యం ఉన్న ఉప‌గ్రహంగా కార్టోశాట్‌-3ని రూపొందించారు.

ఈ ఉపగ్రహాన్ని 97.5 డిగ్రీల వంపులో 509 కిలోమీటర్ల కక్ష్యలో దీన్ని ఫిక్స్ చేయానున్నారని ఇస్రో తెలిపింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా న‌వంబ‌ర్ 25వ తేదీన ఉద‌యం 9.28 నిమిషాల‌కు ఈ ప్రయోగం చేయనున్నారు. పీఎస్‌ఎల్‌వీ-సీ 47 న్యూస్‌స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) ఇటీవ‌ల కుదిరిన ఒప్పందం నేప‌థ్యంలో అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను కూడా కార్టోశాట్‌తో నింగిలోకి పంప‌నున్నారు.

ఈ వార్తని ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories