ఇస్లామియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత.. కాల్పులు జరిపిన అగంతకుడు

ఇస్లామియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత.. కాల్పులు జరిపిన అగంతకుడు
x
ఇస్లామియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత
Highlights

ఢిల్లీ జామియా ఇస్లామియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీలో ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ...

ఢిల్లీ జామియా ఇస్లామియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీలో ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ విద్యార్థి గాయపడ్డాడు.

జామియా క్యాంప్‌ నుంచి రాజ్‌ఘాట్‌ వరకు విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో నల్లటి కోటు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ బయటకు తీసి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి బుల్లెట్‌ గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా సమయంలో భారీగా పోలీసులు సైతం అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories