దేశ రాజధాని ఢిల్లీలో ఆగని సీఏఏ అల్లర్లు.. సీఎం కేజ్రీవాల్ రాజ్ ఘాట్ వద్ద మౌనదీక్ష

దేశ రాజధాని ఢిల్లీలో ఆగని సీఏఏ అల్లర్లు.. సీఎం కేజ్రీవాల్ రాజ్ ఘాట్ వద్ద మౌనదీక్ష
x
దేశ రాజధాని ఢిల్లీలో ఆగని సీఏఏ అల్లర్లు.. సీఎం కేజ్రీవాల్ రాజ్ ఘాట్ వద్ద మౌనదీక్ష
Highlights

దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఘర్షణల్లో ఇప్పటివరకూ హెడ్‌ కానిస్టేబుల్‌ సహా 9 మంది మరణంచారు....

దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఘర్షణల్లో ఇప్పటివరకూ హెడ్‌ కానిస్టేబుల్‌ సహా 9 మంది మరణంచారు. ఘర్షణల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలోని పది ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనలు తీవ్రరూపు దాల్చాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గొడవలు ముదిరి హింసకు దారితీసింది. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌, బాబర్పూర్‌, గోకుల్‌పురి తదితర ప్రాంతాల్లో తాజాగా అల్లర్లు చెలరేగడంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనల కేంద్రాలను ఖాళీ చేయిస్తామంటూ బీజేపీ, ఇతర హిందుత్వ సంస్థలు ప్రకటనలు చేశాయి. వాళ్లలో నిరసనకారులు తలపడటంతో పరిస్థితిని ఉద్రిక్తంగా మారింది. ఘర్షణల్లో ఇప్పటివరకూ హెడ్‌ కానిస్టేబుల్‌ సహా 9 మంది మరణించారు. వీళ్లలో ఎక్కువమంది బుల్లెట్ల వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 24న జరిగిన హింసాత్మక ఘటనల్లో రతన్ లాల్ అనే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు.

సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హింస చెలరేగిన క్రమంలో 35 కంపెనీల పారామిలటరీ బలగాలతో పాటు స్పెషల్‌ సెల్‌, క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సహా ఆర్థిక నేరాల విభాగం అధికారులు సైతం రంగంలోకి దిగారు. ఢిల్లీ పరిసర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించి ఈశాన్య ఢిల్లీలో మోహరించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల్ని కూడా మీటింగ్ కు ఆహ్వానించారు. గంటకుపైగా సాగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇతర ప్రాంతాలకు హింస వ్యాపించకుండా ఈశాన్య ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేయడంతోపాటు ఆర్మీని కూడా రంగంలోకి దించాలనే ప్రతిపాదనపై మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

సీఏఏ వ్యతిరేక నిరసనల్ని వెంటనే ఆపకుంటే శిబిరాల్ని మేమే తొలగిస్తామంటూ బీజేపీ నేతలు చేసిన ప్రకటనల వల్లే ఈశాన్య ఢిల్లీలో హింస చెలరేగిందని సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాజకీయాలకు ఇది సమయం కాదని, హింసను అదుపుచేసేందుకు బీజేపీతోపాటు అన్ని పార్టీలూ సహకరించాలని కేంద్ర మంత్రి అమిత్ షా సూచించారు

ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ రాజ్ ఘాట్ వద్ద మౌనదీక్షకు దిగారు. మాట్లాడి చర్చించుకోవాలి కానీ ఇటువంటి హింసాత్మక ఘటనలు కరెక్ట్ కాదని కేజ్రీవాల్ చెప్పినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హింసాత్మక ఘటనలు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేయాలో తెలియక కేజ్రీవాల్ రాజ్ ఘాట్ దగ్గర మౌనదీక్షకు కూర్చున్నారు.

ఢిల్లీలోని హింస చెలరేగడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో ప్రజలను విడదీసే వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. మహాత్ముడి జన్మించిన దేశంలో హింసకు తావులేదని, ప్రస్తుత సంఘటనలు బాధాకరమని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు మత సామరస్యాన్ని కొనసాగించాల్సిన తరుణమని పేర్కొన్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ పర్యటిస్తున్న సమయంలోనే ఢిల్లీలో హింస చెలరేగడంతో కేంద్ర సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories