జీరో బడ్జెట్‌ ఫామింగ్‌..బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్

జీరో బడ్జెట్‌ ఫామింగ్‌..బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్
x
Highlights

'జీరో బడ్జెట్‌ వ్యవసాయం.. పెట్టుబడి లేకుండా చేసే వ్యవసాయం. అంటే రైతులు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడకుండా చిన్న చిన్న వ్యయాలతో అంతరపంటలు వేసి దాని...

'జీరో బడ్జెట్‌ వ్యవసాయం.. పెట్టుబడి లేకుండా చేసే వ్యవసాయం. అంటే రైతులు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడకుండా చిన్న చిన్న వ్యయాలతో అంతరపంటలు వేసి దాని ద్వారా వచ్చే ఆదాయంతో ప్రధాన పంటలకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ విధానం కొత్తదేమీ కాదు. అయితే, దీన్ని దేశమంతా ప్రవేశపెట్టబోతోంది కేంద్రం.

జీరో బడ్జెట్‌ వ్యవసాయానికి శ్రీకారం చుట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. గ్రామీణ భారతానికి ఆధునిక సౌకర్యాలు కల్పించడం తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. గ్రామాలు, పేదలు, రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే పెట్టుబడి లేని వ్యవసాయ విధానంపై దృష్టిపెట్టినట్లు చెప్పారు.

'జీరో బడ్జెట్‌ వ్యవసాయ విధానాన్ని దేశమంతా అవలంబించేలా చూస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుందని సీతారామన్‌ తెలిపారు. అయితే, కేంద్రం ప్రవేశపెట్టే ఈ విధానం దేశంలో ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories