logo

బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్
Highlights

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగ దారుల కోసం మరో ఆకర్షణీయ ప్లాన్‌ను ఆవిష్కరించింది. 180...

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగ దారుల కోసం మరో ఆకర్షణీయ ప్లాన్‌ను ఆవిష్కరించింది. 180 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త రూ.899 ప్యాక్‌ని లాంచ్ చేసింది. ఈ ఆఫర్లో భాగంగా రోజుకి 1.5 జీబీ డేటా మొత్తం 270 జీబీ డేటా తోపాటు అపరిమిత కాల్స్ (ముంబై, ఢిల్లీ సర్కిల్ మినహా)‌తో పాటు 50 ఉచిత ఎస్ఎంఎస్‌లు పంపుకునే వీలుంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉంటుందని తెలిపింది. కాగా బీఎస్ఎన్ఎల్‌లో ఇప్పటికే రూ.999 రీచార్జ్ ప్యాక్ ఉన్నప్పటికీ దీని కాలపరిమితి కూడా 181 రోజులు మాత్రమే. ఇందులోనూ రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ దేశమంతటికీ అందుబాటులో ఉంది.


లైవ్ టీవి


Share it
Top