బ్రిడ్జ్ కూలిన ఘటనలో 40మంది మృతి

X
Highlights
బ్రెజిల్ లోని పరావోపెబా నదిపై ఉన్న డ్యాం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 40 చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం...
Raj27 Jan 2019 1:43 AM GMT
బ్రెజిల్ లోని పరావోపెబా నదిపై ఉన్న డ్యాం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 40 చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దుర్ఘటనలో సుమారు 300 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. డ్యాం కూలడంతో సమీపంలోని ప్రాంతాల్లో బురద ముంచెత్తింది. ఇళ్లన్నీ బురదతో నిండిపోవడంతో బాధితులను హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డ్యాం కూలిపోవడంతో 'వలే' కంపెనీపై బ్రెజిల్ పర్యావరణశాఖ శనివారం సుమారు రూ.462 కోట్ల భారీ జరిమానా విధించింది. కొన్ని నెలల క్రితమే జర్మనీకి చెందిన టుయెవ్ స్యూడ్ కంపెనీ ఈ ఆనకట్టను తనిఖీ చేసి ఎలాంటి లోపాలు లేవని ధ్రువీకరించింది. కాగా ఆనకట్ట పూర్తిగా కూలడంతో భారీ స్థాయిలో బురద వరదలా పొంగి సమీపంలో ఉన్న ప్రాంతాన్ని ముంచెత్తింది..మధ్నాహ్న భోజనం చేస్తున్న కార్మికులందరూ బురద కింద సజీవ సమాధి అయ్యారు.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMTకామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 61 పతకాలు..
9 Aug 2022 2:30 AM GMTనేడు మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ...
9 Aug 2022 2:10 AM GMT