ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే
x
Highlights

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది....

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను 50శాతం మించకుండా చూడాలంటూ బీర్రు ప్రతాప్ రెడ్డి, బీసీ రామాంజనేయులు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు నిబంధనను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని పిటిషన్లలో పేర్కొన్నారు.

దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన కోర్టు 59.85 శాతం రిజర్వేషను కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 176పై స్టే విధించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో దీనికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అంతవరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. కాగా, ఈ నెల 17 స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్‌ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న జారీ చేసిన జీవో 176ని జారీ చేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories