Top
logo

Mangaluru airport: ఎయిర్ పోర్టులో బాంబ్.. ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి పేల్చిన బాంబ్ స్వ్కాడ్ !

Mangaluru airport: ఎయిర్ పోర్టులో బాంబ్.. ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి పేల్చిన బాంబ్ స్వ్కాడ్ !ఎయిర్ పోర్టులో బాంబ్
Highlights

కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. టికెట్‌ కౌంటర్‌ వద్ద అనుమానాస్పద బ్యాగ్‌ను...

కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. టికెట్‌ కౌంటర్‌ వద్ద అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్న ఎయిర్‌పోర్టు పోలీసులు, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆ బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు. దీంతో ఆ బ్యాగ్‌ను థ్రెట్ కంటైన్మెంట్ వెహికల్‌లో ఉంచి, కిలోమీటరు దూరంలో కెంజార్‌లోని బహిరంగ స్థలానికి తీసుకెళ్లి పరిశీలించారు. బ్యాగ్‌లో మెటల్ కాయిన్ బాక్స్ ఉందని, అందులో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేసిన అధికారులు ఎయిర్‌పోర్టులో హై అలర్ట్‌ ప్రకటించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు నిందితుడి ఫోటోలను విడుదల చేశారు. అలాగే నిందితుడు వెళ్లిన ఆటోరిక్షాను ఫోటోను కూడా రిలీజ్‌ చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డీఐజీ సమాచారంతో నిందితుడు బ్యాగ్‌ను మంగళూరు విమానాశ్రయంలో ఉంచి, ముఖాన్ని దాచుకుంటూ ఆటోలో అక్కడినుంచి ఉడాయించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Web TitleBomb at airport, the bomb squad exploded at open place
Next Story

లైవ్ టీవి


Share it