ఆ సైట్లను తాత్కాలికంగా బ్లాక్‌ చేయండి: దిల్లీ హైకోర్టు

ఆ సైట్లను తాత్కాలికంగా బ్లాక్‌ చేయండి: దిల్లీ హైకోర్టు
x
Highlights

తమిళ్ రాకర్స్, ఈజెడ్ టీవీ, కట్ మూవీస్, లైమ్ టోరెంట్స్ వంటి సైట్లను తాత్కాలికంగా బ్లాక్ చేయమని ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవెడర్లన(ఐ.ఎన్.పి) దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

తమిళ్ రాకర్స్, ఈజెడ్ టీవీ, కట్ మూవీస్, లైమ్ టోరెంట్స్ వంటి సైట్లను తాత్కాలికంగా బ్లాక్ చేయమని ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవెడర్లన(ఐ.ఎన్.పి) దిల్లీ హైకోర్టు ఆదేశించింది. అమెరికాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నన్ బద్రర్స్ తమ నిర్మాణ సంస్థ నుంచి వెలువడిన చిత్రాలను, వెబ్ సినిస్ ల ను అనధికారికంగా తమిళ్ రాకర్స్ వంటి వెబ్ సైట్స్ ఫ్రీగా చూపిస్తున్నారని దిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఒక దీనిపై విచారించిన దిల్లీ హైకోర్టు ఆ సైట్లను తాత్కాలికం బ్లాక్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలానే నిర్మాణ సంస్థలకు చెందిన కాపీరైట్లను ఉల్లంఘించినందుకు ఆ వెబ్‌సైట్లపై నమోదు చేసిన డొమైన్‌ పేర్లను తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖకు మార్గనిర్దేశం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories