కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ

కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ
x
Highlights

ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే ఉన్నందున పార్టీ మరింత పటిష్టతపై దృష్టిసారించింది బీజేపీ. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం...

ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే ఉన్నందున పార్టీ మరింత పటిష్టతపై దృష్టిసారించింది బీజేపీ. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ముగ్గురు మాజీ సీఎంలకు బీజేపీ అధిష్టానం కీలక పదవులు కల్పించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎంలైన శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, రమణ్ సింగ్‌లను భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు పార్టీ బులిటెన్ విడుదల చేశారు. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ముగ్గురు..

నేతలు ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయారు. ఈ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్ ప్రభుత్వం దారుణమైన ఓటమిని చవిచూడగా.. మధ్యప్రదేశ్‌లో మాత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ గట్టి పోటీ ఇచ్చారు. ఇక రాజస్థాన్‌లో వసుంధరా రాజే కూడా గట్టిపోటీయే ఇచ్చినా అధికారాన్ని హస్తగతం చేసుకుంది కాంగ్రెస్. కాగా సిఎంలుగా అనుభవజ్ఞులైన చౌహాన్, రమణ్ సింగ్, వసుంధరా రాజేలను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories