ఆపరేషన్ మధ్యప్రదేశ్‌ మొదలుపెట్టిన బీజేపీ

ఆపరేషన్ మధ్యప్రదేశ్‌ మొదలుపెట్టిన బీజేపీ
x
Highlights

ఆపరేషన్ కర్నాటక ముగియడంతో కమలనాథులు నెక్ట్స్ టార్గెట్‌పై గురిపెట్టారు. కర్నాటక మాదిరిగా.... అధికారానికి అతి దగ్గరగా వచ్చి ఆగిపోయిన మధ్యప్రదేశ్‌లో...

ఆపరేషన్ కర్నాటక ముగియడంతో కమలనాథులు నెక్ట్స్ టార్గెట్‌పై గురిపెట్టారు. కర్నాటక మాదిరిగా.... అధికారానికి అతి దగ్గరగా వచ్చి ఆగిపోయిన మధ్యప్రదేశ్‌లో ఆపరేషన్ మొదలుపెట్టారు. రెబల్స్‌‌ అండ్ నెంబర్‌ గేమ్‌తో కర్నాటకలో సంకీర్ణ సర్కారును కుప్పకూల్చినట్లే... మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పావులు కదిపింది. ఆపరేషన్ మధ్యప్రదేశ్‌పై సంకేతాలిచ్చిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్..... కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు కూలిపోతే దానికి బీజేపీ కారణం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమని, కానీ దానికదే పడిపోవడం ఖాయమన్నారు.

చేతికి మట్టి అంటకుండా రెబల్స్ గేమ్‌తో కన్నడనాట పని కానిచ్చేసిన బీజేపీ.... అదే దారిలో మధ్యప్రదేశ్‌ను కూడా చేజిక్కించుకునేందుకు ఆట మొదలుపెట్టింది. తమ అధిష్టానం కనుసైగ చేస్తేచాలు... 24గంటల్లోగా కాంగ్రెస్‌ సర్కారు కూలిపోతుందంటూ మధ్యప్రదేశ్‌ బీజేపీ నేత భార్గవ.... అసెంబ్లీలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే, ప్రతిపక్ష నేత భార్గవ కామెంట్స్‌‌కు ముఖ్యమంత్రి కమలనాథ్‌ కూడా అంతే దీటుగా కౌంటరిచ్చారు. బలనిరూపణకు సిద్ధంగా ఉన్నానన్న కమల్‌నాథ్‌.... తమ ప్రభుత్వాన్ని కూలదోయడం అంత ఈజీ కాదనే సంగతి.... బీజేపీ హైకమాండ్‌కు తెలుసన్నారు.

గతేడాది జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 114 సీట్లతో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే హ్యాట్రిక్ విజయాలతో అప్పటివరకు మూడు పర్యాయాలు అధికారంలో కొనసాగిన బీజేపీ సైతం 108 సీట్లతో నాలుగోసారి అధికారానికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అయితే 230మంది ఎమ్మెల్యేలున్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 121మంది సభ్యుల మద్దతు అవసరముండటంతో.... బీఎస్సీ, ఎస్పీ, ఐఎన్‌డీ, ఇండింపెండెట్స్‌తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం కట్టబెట్టిన మధ‌్యప్రదేశ్‌ ఓటర్లు.... ఆరేడు నెలల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం బీజేపీకి బంపర్ విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం 29 ఎంపీ స్థానాల్లో 28 సీట్లను కమలం కైవసం చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా బీజేపీ సూపర్ విక్టరీ దక్కడంతో... అప్పట్నుంచి రాష్ట్రంలోనూ అధికారాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతోంది.

అయితే, బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన కాంగ్రెస్‌.... రివర్స్‌లో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యేలను తమవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురితో కాంగ్రెస్‌ మంతనాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories