logo
జాతీయం

కాంగ్రెస్, టీడీపీలపై రామబాణం..ఇంకెందరు..?

కాంగ్రెస్, టీడీపీలపై రామబాణం..ఇంకెందరు..?
X
Highlights

ఒక్క సీటు కూడా గెలవలేదు కనీసం వన్ పర్సంట్‌ ఓట్లు కూడా రాలేదు కానీ ఆంధ్రప్రదేశ్‌పై కమలం గురిపెట్టింది. కుదిరితే ...

ఒక్క సీటు కూడా గెలవలేదు కనీసం వన్ పర్సంట్‌ ఓట్లు కూడా రాలేదు కానీ ఆంధ్రప్రదేశ్‌పై కమలం గురిపెట్టింది. కుదిరితే 2024 కుదరపోతే 2029 మొత్తానికి ఏపీలో అధికార పీఠమే లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది.

ఇటీవల జరిగిన లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ నుంచి ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన బీజేపీ ఆంధ్రప్రదేశ్‌‌లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. కనీసం వన్ పర్సంట్‌ ఓట్లు కూడా రాకపోయినా భవిష్యత్‌పై భరోసాతో ఆపరేషన్‌‌ మొదలుపెట్టింది. రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి తిరుమల వచ్చిన మోడీ ఇదే స్లోగన్ వినిపించారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లోనూ పాగా వేస్తామంటూ ధీమా వ్యక్తంచేశారు.

ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ వస్తోన్న కమలదళం ఆంధ్రప్రదేశ్‌‌పైనా సీరియస్‌గా కన్నేసింది. ఆపరేషన్ స్పెషలిస్ట్ రాంమాధవ్‌‌కు తెలుగు రాష్ట్రాల బాధ్యతలను బీజేపీ అధిష్టానం అప్పగించడంతో ఏపీ, తెలంగాణలో ప్రకంపనలు మొదలయ్యాయి. ముందుగా తెలంగాణపై ఫోకస్‌ పెట్టిన రాంమాధవ్ ఇప్పుడు ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. ముఖ్యంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలై కోలుకోలేని దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీపై కన్నేశారు. అధికారం కోల్పోయి ఏం చేయాలో పాలుపోక సతమతమవుతోన్న లీడర్లపై దృష్టిపెట్టారు.

టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేయడంలో కూడా రాంమాధవ్‌ చక్రం తిప్పారు. టీడీపీ రాజ్యసభ ఎంపీలతో రెండు దఫాలుగా చర్చలు జరిపిన రాంమాధవ్ బీజేపీలోకి ఆహ్వానించారు. రాంమాధవ్‌ చర్చలు ఫలించడంతోనే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరారు. కాకినాడలో టీడీపీ కాపు నేతల సమావేశం వెనుక కూడా రాంమాధవ్‌ స్కెచ్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఏపీలో బలమైన సామాజికవర్గంగా, పెద్దసంఖ్యలో ఉన్న కాపులను అక్కున చేర్చుకోవడం ద్వారా ఏపీలో బలపడాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది.

Next Story