దీపాలకి బదులుగా గాల్లోకి కాల్పులు... బీజేపీ నేతపై కేసు నమోదు

దీపాలకి బదులుగా గాల్లోకి కాల్పులు... బీజేపీ నేతపై కేసు నమోదు
x
Manju Tiwari
Highlights

కరోనావైరస్ ని ఎదురుకోవడానికి సంఘీభావంగా ఏప్రిల్ 05 న (ఆదివారం) రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

కరోనావైరస్ ని ఎదురుకోవడానికి సంఘీభావంగా ఏప్రిల్ 05 న (ఆదివారం) రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. ప్రధాని ఇచ్చిన ఈ పిలుపుకు దేశంలోని అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.. ఇక దేశ ప్రజలు కూడా దీపాలు వెలిగించి మద్దతు తెలిపారు.. అయితే ఉత్తర ప్రదేశ్‌లోని ఓ బీజేపీ నాయకురాలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. దీపాలు వెలిగించడానికి బదులు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమెనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం..

బలరాంపూర్‌లోని భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మంజు తివారీ దీపాలు వెలిగించడానికి బదులు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక యుపి కాంగ్రెస్ ఈ వీడియోను ట్వీట్ చేసి చట్టాన్ని ఉల్లంఘించడంలో బీజేపీ నాయకులు ఎప్పుడూ ముందుంటారు అంటూ వాఖ్యనించింది. అయితే తన తప్పును అంగీకరిస్తు మరియు దానికి క్షమాపణలు కోరుతున్నట్లుగా మంజు తివారీ పేర్కొన్నారు. అయితే దీనిపైన కొత్వాలి నగర్‌ పోలీసులు సెక్షన్‌ 286, సెక్షన్‌ 30 కింద మంజు తివారీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories