అప్పడు త్యాగం.. ఇప్పుడు గౌరవం..

అప్పడు త్యాగం.. ఇప్పుడు గౌరవం..
x
Highlights

బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రైల్వే మంత్రిగా, మోదీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నూతన గవర్నర్లను నియమించింది. తెలంగాణ గవర్నర్ గా తమిలిసై సౌందర్ రాజన్ ను నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మహారాష్ర్ట గవర్నర్ గా భగత్ సింగ్ కోషియారి, కేరళ గవర్నర్ గా ఆరీఫ్ మహ్మద్ ఖాన్ ను నియాకమం అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను రాజస్థాన్ కు బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు మహారాష్ర్ట గవర్నర్ గా పని చేసిన విద్యాసాగర్ రావు, తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన నర్సింహన్ కు ఎలాంటి పదవి ఇవ్వలేదు.

బండారు దత్తాత్రేయ జూన్ 12, 1946లో జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా పొందారు. 1965లోనే ఆర్ఎస్ఎస్‌లో కార్యకర్తగా చేరారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీలో చేరి కీలక పదవులు చేపట్టారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రైల్వే మంత్రిగా, మోదీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. నాలుగుసార్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 89లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 96 నుంచి 98 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. తొలిసారి 1991లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు. 1998, 99, 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచే గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఈ ఏడాది 2019 సార్వత్రిక ఎన్నికల బరిలో దూరంగా ఉన్నారు. అయితే మొదట సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేయాలని దత్తాత్రేయ భావించినా అధిష్ఠానం మాత్రం ఆ సీటును ఆయనకు నచ్చజేప్పి స్థానంలో కిషన్ రెడ్డిని బరిలో దింపింది. అప్పుడు దత్తాత్రేయ ఎంపీ సీటు త్యాగం చేయడంతో నేడు గవర్నర్ పదవితో అధిష్ఠానం ఆయన్ను సంతృప్తి పరిచింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories