కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుష్మాస్వరాజ్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుష్మాస్వరాజ్ కన్నుమూత
x
Highlights

బీజేపీ నాయకురాలు మరియు కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ (67) గుండెపోటుతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె...

బీజేపీ నాయకురాలు మరియు కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ (67) గుండెపోటుతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమెకి ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలోనే ఆమె గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు.. 2014-19 సంవత్సరంలో మోడీ ప్రభుత్వంలో ఆమె విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో సుష్మాస్వరాజ్ తనకంటూ ఓ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు . ఆమె కేంద్ర మంత్రిగా ఏ శాఖను చేపట్టిన దానికి వన్నె తెచ్చారని చెప్పాలి .

ముఖ్యంగా గల్ప్ దేశాల్లో చిక్కుకున్న భారతీయలను రక్షించేందుకు ఆమె చాలా రకాల చర్యలను తీసుకున్నారు . సుష్మాస్వరాజ్ 1952 ఫిబ్రవరి 14 న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. ఆమె కేంద్ర మంత్రిగానే కాకుండా ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. మొత్తం 7 సార్లు ఎంపీగా గెలిచారు సుష్మాస్వరాజ్ .. 1990 లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996, 98లో వాజ్ పాయ్ ప్రభుత్వం లో కేంద్ర మంత్రిగా పనిచేసారు . 1975లో సుష్మాస్వరాజ్ వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్వరాజ్ కౌశల్‌ను వివాహంచేసుకున్నది. వారి సంతానం ఒక కూతురు. భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మిజోరాం గవర్నరుగా పనిచేశాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories