ఏనుగును ఢీకొట్టబోయిన బైక్ వాలా! వీడియో వైరల్ !

ఏనుగును ఢీకొట్టబోయిన బైక్ వాలా! వీడియో వైరల్ !
x
Highlights

ఇటీవల కాలంలో ఓ భారతీయ అటవీశాఖ అధికారి తన ట్విటర్ అకౌంట్ లో ఓ వీడియోను షేర్ చేసారు.

ఇటీవల కాలంలో ఓ భారతీయ అటవీశాఖ అధికారి తన ట్విటర్ అకౌంట్ లో ఓ వీడియోను షేర్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు నెటిజన్ల ఫోన్లలో చెక్కర్లు కొడుతుంది. అంతే కాదు ఈ వీడియోను చూసిన వారంతా వీడియో కింద కామెంట్లు పెట్టి దాన్ని రీపోస్ట్ చేస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఏ ముందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వీడియోలో ఒక ఏనుగు రోడ్డు దాటే సమయంలో అన్ని వాహనాలు కొంత దూరంలో ఆగాయి. కానీ కాస్త కూడా ఓపిక, సహనం లేని ఓ ద్విచక్ర వాహనదారుడు మాత్రం ఆ ఏనుగు సరిగ్గా రోడ్డు దాటే సమయానికి దాదాపుగా దాన్ని ఢీ కొడుతూ వెళ్లినట్టుగానే రోడ్డును దాటాడు. దీంతో ఆ ఏనుగు ఆ వాహనదారుని వెనక పడినప్పటికీ మళ్లీ అది దాని దారి మల్లించుకుని అడవిబాట పట్టింది.

ఇక ఈ వీడియో చూసిన ఐఎఫ్ఎస్ అటవీ అధికారి ప్రవీన్ కశ్వాన్ వీడియోను పోస్ట్ చేస్తూ వీడియో కింద వాహనదారుడు చేసిన పనిని విమర్శిస్తూ కామెంట్ రాసాడు. ఇక ఈ వీడియోనే చూసిన నెటిజనులు కూడా కశ్వాన్ చేసిన కామెంట్ ను సమర్ధిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories