మరో రెండు రోజులు బ్యాంకులు బంద్.. నగదు కోసం ఏటీఎం..

మరో రెండు రోజులు బ్యాంకులు బంద్.. నగదు కోసం ఏటీఎం..
x
Highlights

ఈ నెల 8, 9 తేదీల్లో బ్యాంకులు మరోమారు మూతపడనున్నాయి. ఉద్యోగ విధానాలపై కేంద్రం తీరును నిరసిస్తూ పది ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి....

ఈ నెల 8, 9 తేదీల్లో బ్యాంకులు మరోమారు మూతపడనున్నాయి. ఉద్యోగ విధానాలపై కేంద్రం తీరును నిరసిస్తూ పది ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం, భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య లు ఈ నెల 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని, ఆ సమాచారాన్ని భారత బ్యాంకుల సంఘానికి అందించినట్టు ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొన్నాయి. గత నెలలోనూ వివిధ కారణాలతో రెండుసార్లు బ్యాంకులు మూత పడ్డాయి. ఇక బ్యాంకులు మరోసారి సమ్మె బాట పట్టడంతో అసలే అంతంత మాత్రం నడుస్తున్న ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో వినియోగదారుల ముందుగానే తమకు కావలసినంత నగదును డ్రా చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories