నవంబర్ లో బ్యాంకు సెలవులు ఇవే.....

నవంబర్ లో బ్యాంకు సెలవులు ఇవే.....
x
Highlights

రోజు నగదు లావాదేవీలు చేయాలనుకునే వారికి బ్యాంకులుతో ప్రతి ఒక్కరోజు పని ఉంటుంది.. వీరు ముందు జాగ్రత్తగా బ్యాంకు సెలవుల గురించి తెలుసుకుంటే మంచిది . ఈ...

రోజు నగదు లావాదేవీలు చేయాలనుకునే వారికి బ్యాంకులుతో ప్రతి ఒక్కరోజు పని ఉంటుంది.. వీరు ముందు జాగ్రత్తగా బ్యాంకు సెలవుల గురించి తెలుసుకుంటే మంచిది . ఈ నెల(నవంబర్) లో ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ నెలలో ఎప్పటి లాగే రెండవ శనివారం 9 వ తేదీన, నాలుగోవ శనివారం 23 తేదీల్లో సెలవులు ఉన్నాయి.. ఆ రోజున బ్యాంకులు పనిచేయవు.. ఇక ఈ నెలలో మొత్తం నాలుగు ఆదివారాలు రానున్నాయి.. 3, 10, 17, 24 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు..వీటికి అదనంగా బ్యాంకు ఉద్యోగులకు మరో ఒక రోజు మాత్రమే సెలవు లభించింది. నవంబర్ 12వ తేదీ మంగళవారం గురు నానక్ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఇది తెలంగాణలో మాత్రమే అని తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో తెలియాల్సి ఉంది. ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories