ఆధార్ లింక్ తోనే కిసాన్ సమ్మాన్..

ఆధార్ లింక్ తోనే కిసాన్ సమ్మాన్..
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ప్రతి ఏటా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రూ. 6000 లను అందిస్తుందని. ఈ మొత్తాన్ని కూడా ఒకే దఫాలో కాకుండా...

ప్రతి ఏటా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రూ. 6000 లను అందిస్తుందని. ఈ మొత్తాన్ని కూడా ఒకే దఫాలో కాకుండా మొత్తం నాలుగు విడుతలలో రైతుల ఖాతాల్లో జమచేస్తుంది. ఈ నిధులు సద్వినియోగం చేసుకోవాలనుకున్నవారు తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ను అనుసంధించాలని ఇటీవల ఎకనామిక్స్ టైమ్స్ లో ప్రచురించారు. కాకపోతే ఇప్పటివరకూ ఆధార్ అనుసంధానం గురించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

ఇన్ని ఏళ్ల నుంచి ఈ పథకానికి ప్రభుత్వం ఎలాంటి నియమనిబంధనలు విధించలేదు. మూడు విడతల సాయం ఇప్పటికే అందగా ఇక నాలుగో విడత సాయం అందిచాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే బ్యాంక్ ‌ఖాతాలను ఆధార్ తో అనుసంధానం చేయాలనే అంశం తెరమీదికి వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాలను ఆర్థింగా ముందంజలో నిలిపేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారని, ఈ సారి దాదాపుగా రూ.10వేల కోట్లను ఒకే రోజు అందించే అవకాశం ఉందని ఓ వ్యవసాయ శాఖ అధికారి వెల్లడించారని ప్రము‌ఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories