మనసున్న ఆటో డ్రైవరన్న.. పెళ్లికి దాచుకున్న డబ్బులు పేదల ఆకలి కోసం!

మనసున్న ఆటో డ్రైవరన్న.. పెళ్లికి దాచుకున్న డబ్బులు పేదల ఆకలి కోసం!
x
Highlights

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సరైనా మార్గంగా ఎంచుకొని ముందుకి వెళ్తున్నాయి.

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సరైనా మార్గంగా ఎంచుకొని ముందుకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ వలన చాలా మంది అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇక వలస కార్మికుల పరిస్థితి ఎంత చెప్పినా తక్కువే. ఉపాధి కొల్పయి డబ్బులు లేకా ఎండలను సైతం లెక్కచేయకుండా రోడ్లపైన నడుచుకుంటూ వెళ్తున్నారు. వారికి ఆదుకోవడానికి కొందరు ముందుకు వచ్చి భోజన వసతులు కలిపిస్తున్నారు.

అందులో భాగంగానే పూణే లోని ఓ ఆటో డ్రైవర్ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తన గొప్ప మానవత్వాన్ని చాటుకున్నాడు. అక్షయ్ కొతవాలే (30) అనే ఓ ఆటో డ్రైవర్ ఆటో నడుపుకుంటూ తన పెళ్లికి రెండు లక్షల రూపాయలను పొదుపు చేశాడు. మే 25న పెళ్లికి ముహూర్తం కుదిరింది. అయితే కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి వేడుక జరుపుకోవడం సరైంది కాదని భావించి తనకి కాబోయే భార్యతో మాట్లాడి దాచుకున్న డబ్బులతో పెద్దవాళ్ళు ఆకలి నింపుతున్నాడు.

ప్రతీ రోజు తన ఆటోలో తిరుగుతూ రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులు, వయోవృద్ధులకు రోజూ అన్నం పెడుతున్నాడు. అంతేకాకుండా తన ఆటోలో గర్భిణీ మహిళలను ఉచితంగా క్లినిక్‌ కు తీసుకెళ్తున్నాడు. కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్షయ్ చేస్తున్న ఈ మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories